కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన కర్ఫ్యూ అమలు తీరును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ద్విచక్రవాహనంపై ఆయన పర్యటించారు. పట్టణంలోనూ, పలు గ్రామాల్లో నిబంధనల అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు. రహదారులపై వెళ్తున్నవారిని.. బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందో కారణాలు ఆరా తీశారు. గ్రామాల్లో తిరుగుతున్న వారిని ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రజలంతా భాగస్వామ్యం వహించినప్పుడే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వైరస్ నివారణకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: మర్లగుమ్మి ఆనకట్టకు మరమ్మతులు ఎప్పుడు ?