ETV Bharat / state

'సంక్రాంతికి ముందే ఇళ్ల పట్టాల రూపంలో కానుకలు' - ఇళ్ల పట్టాలు పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని ఇళ్ల పట్టాలు పంపిణీ అట్టహాసంగా సాగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పదహారు వందల ఎనిమిది మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

mla karumuri nageshwararao distributed house plota at tanuku
లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ
author img

By

Published : Dec 25, 2020, 10:54 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలోని మండపాక, వేల్పూరు, మహాలక్ష్మి చెరువు గ్రామాల్లోని లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మండపాకలో సేకరించిన భూమి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మూడు గ్రామాలకు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను అందజేశారు.

రాష్ట్రంలో ఈ రోజు సంక్రాంతి పండుగను మించిన పండుగ జరుగుతోందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సంక్రాంతి పండగకు అల్లుడొస్తే కానుకలు ఇస్తారని.. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు సంక్రాంతికి ముందే ఇళ్ల పట్టాల రూపంలో కానుకలు ఇస్తున్నారని చెప్పారు. తెదేపా హయాంలో సెంటు భూమి కూడా సేకరించ లేదని ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాలతో పాటు.. ఇళ్ల నిర్మాణం మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఇదీ చదవండి: రైతుల వద్ద లంచం... ఏఎంవీఐపై సస్పెన్షన్ వేటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.