రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. దీనికి సంబంధించి ఇల్లు, స్థలం లేని వారి వివరాలను ఈ నెల 26, 27, 28 తేదీల్లో వాలంటీర్లు సేకరిస్తారని తెలిపారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నడ అగ్రహారంలో వైకాపా నాయకులు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెల్టా ప్రాంతంలో జల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరటంతో విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. గోదావరిలోని నీటిని శుద్ధి చేసి విజ్జేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా గ్రామాల్లోని తాగునీటి చెరువులకు సరఫరా చేస్తామన్నారు. ఎనిమిది వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని శ్రీరంగనాథరాజు తెలిపారు. పెన్నడ అగ్రహారంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి శ్రీరంగనాథరాజు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ నరసింహ రాజులు ఆహ్వానించారు.
"డెల్టా గ్రామాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలు" - godavari water
పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మంచినీటి సమస్య తీర్చుతామని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. గోదావరి నీటిని శుద్ధి చేసి గ్రామాల్లోని చెరువులకు సరఫరా చేయనున్నట్లు చెప్పారు.