ETV Bharat / state

ఈ నెల 14న చింతలపాటి మూర్తిరాజు జయంతి వేడుకలకు సీఎం హాజరు

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం చింతలపాటి మూర్తిరాజు డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు.

చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం
చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం
author img

By

Published : Dec 10, 2019, 11:55 PM IST

చింతలపాటి మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు జరపనున్న ప్రభుత్వం

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం చింతలపాటి మూర్తిరాజు శత జయంతి ఉత్సవాలకు ఈ నెల 14న ముఖ్యమంత్రి హాజరవుతారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. వేడుకలను చింతలపాటి మూర్తిరాజు డిగ్రీ కళాశాలలో జరపనున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఎనలేని సేవలు మూర్తిరాజు చేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించిన వ్యక్తి అంటూ కొనియాడారు. 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగాను, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవలు చేశారని అన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తని ప్రశంసించారు. ఆయన యావదాస్తితో నిర్మించిన గాంధీ భవనాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామన్నారు.

ఇదీ చదవండి:

పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం

Intro:AP_TPG_76_10_MINISTER_PRESS_MEET_AV_10164

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం చింతలపాటి మూర్తిరాజు డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధారాజు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైధ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి చింతలపాటి మూర్తిరాజని మంత్రి రంగరాజు అన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించిన వ్యక్తి మూర్తిరాజన్నారు. ఆయన యావాదాస్తి దారబోసి గాంధీ భవనాన్ని నిర్మించారని తెలిపారు. అటువంటి మహనీయుని శతజయంతి వేడుకలను జరుపుకోవడంతో పాటుగా ముఖ్యమంత్రి ఆదేశాలతో గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి పరుస్తామన్నారు. మూర్తిరాజు తలపెట్టిన కార్యక్రమాలను పూర్తిచేయడమే ఆయనకు మనము ఇచ్చే ఘనమైన నివాళని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. 30 ఏళ్లపాటు ఎమ్మెల్యేగాను, మంత్రిగా పనిచేసి ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి మూర్తిరాజని కొనియాడారు. మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తన్నారు. ఆయన శత జయంతి ఉత్సవాలల్లో భాగంగా 14వ తేదీన గణపవరం డిగ్రీ కళాశాలలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనను విజయవంతం చెయ్యాలని. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. మంత్రి, ఎమ్మల్యేలతో పాటుగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, వైసీపీ నేతలు కొయ్యే మోషేన్ రాజు, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. Body:ఉంగుటూరుConclusion:9493990333

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.