పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో ఉంటున్న వలస కూలీలు ఆందోళన బాట పట్టారు. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన 106 మంది వలస కూలీలను 18 రోజుల క్రితం ఇక్కడ ఉంచారు. గత వారం రోజులుగా వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు పంపుతున్న నేపథ్యంలో తమనూ పంపాలని వారు కోరుతున్నారు.
ఈ క్రమంలో సైకిళ్లపై స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వలస కూలీలు అక్కడే బైఠాయించి స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆందోళన చేపట్టారు. అనుమతిస్తే నడుచుకుంటూ అయినా వెళ్తామని వేడుకున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. తాము ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో పంపేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి.. అడవి జంతువులను వేటాడుతున్న ఇంటి దొంగ