పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీహార్‌కు చెందిన 44 మంది వలస కూలీలు ఆందోళన చేశారు. లాక్డౌన్ కారణంగా 2 నెలల నుంచి పనులు లేక పడరాని పాట్లు పడుతున్నామని, తమను స్వరాష్ట్రలకు పంపించే చర్యలు చేపట్టాలని కోరారు.
పెదవేగి మండలం నడిపల్లిలోని సీడ్ సంస్థలో బీహార్‌కు చెందిన వారు పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు లేక... ఇంటికి వెళ్లే మార్గం లేక.. 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ యజమానులను ఇంటికి పంపిచేలా చర్యలు తీసుకోవాలని కోరినా.. వారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయంపై స్పందించిన తహసీల్దార్ బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. కానీ.. ఖర్చును కూలీలే భరించాలని చెప్పగా.. అంత డబ్బులు తమ దగ్గర లేవని వారు బదులిచ్చారు. వదిలేస్తే నడిచి అయినా వెళ్తామని చెప్పారు. విషయం ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లగా.. వారి స్పందన కోసం కూలీలు ఎదురు చూస్తున్నారు.
ఇదీ చూడండి: