పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో కొలువుదీరిన ఎల్లారమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఏకవీరాదేవి అంశతో వెలసిన అమ్మవారిని శరన్నవరాత్రి రోజుల్లో దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్ కారణంగా సామూహిక కుంకుమ పూజలను నిషేధించారు. నిబంధనలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: పాలంగి కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం