ETV Bharat / state

ద్వారకా తిరుమల వెంకన్నను దర్శించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి - west godavari news

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప సత్యనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

madras high court judge pushpa sathyanarayana
ద్వారకా తిరుమల
author img

By

Published : Jul 22, 2021, 9:59 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప సత్యనారాయణ గురువారం సాయంత్రం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి.. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆమె ఆలయ అర్చకులు పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు జస్టిస్ పుష్ప సత్యనారాయణకి స్వామివారి ప్రతిమను, ప్రసాదాలను అందించారు.

ఇదీ చదవండి:

YSR kapunestham: కాపు నేస్తం నిధులు విడుదల.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు

పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.