పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర దేవతగా విరాజిల్లుతున్న కుంకుళ్లమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా అమ్మవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదవ రోజు కుంకుళ్లమ్మవారు.. సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేశారు.
నవరాత్రి వేడకల్లో భాగంగా సరస్వతీ దేవి జన్మ నక్షత్రం రోజున ఇలా విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమ పూజ, చండీ హోమం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు...హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం