ETV Bharat / politics

ఈ కార్ రేసు కేసు - హైకోర్టులో కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ విచారణ - FORMULA E CAR RACE CASE ON KTR

హైకోర్టులో కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ - రిజిస్ట్రీకి వెళ్లాలని కేటీఆర్‌ తరఫు లాయర్లకు సీజే సూచన

formula_e_car_race_case_on_ktr
formula_e_car_race_case_on_ktr (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 1:04 PM IST

Updated : Dec 20, 2024, 3:27 PM IST

Formula E Car Race case on KTR : ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫార్ములా ఈ - కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్‌పైన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్ వేశారు.

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు - A1గా కేటీఆర్‌

జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ బెంచ్‌ ముందు పిటిషన్ దాఖలు చేసి భోజన విరామం తర్వాత విచారించాలని కేటీఆర్‌ తరఫు లాయర్లు విజ్ఞప్తి చేశారు. కాగా, సీజే బెంచ్‌కు వెళ్లాలని సూచించిన జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ సీజే ముందు మెన్షన్‌ చేశారు. రిజిస్ట్రీకి వెళ్లాలని కేటీఆర్‌ తరఫు లాయర్లకు సీజే సూచించిన నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో అనుకూలతను బట్టి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతితో జడ్జిలు సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్​లో నిర్వహించిన ఫార్ములా -ఈ కార్‌ రేస్‌పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ దర్యాప్తు ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) ఆధ్వర్యంలో కొనసాగనుంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సీఐయూ పనిచేయనుండగా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్​ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేసు పూర్వాపరాల పరిశీలనకు ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంటున్నారు. ముందుగా SX అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను పరిశీలించాలని ఏసీబీ భావిస్తోంది.

ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ ఏసీబీ రికార్డ్ చేయనున్నట్టు సమాచారం. రేస్​కు సంబంధించి రూ.54.88 కోట్లు లావాదేవీలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్‌ఎండీఏ, ఆర్థికశాఖ, RBI అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని, అందులో రూ.46 కోట్ల వరకు డైరెక్ట్​గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అని ప్రధాన అభియోగం.

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​పై ఏసీబీ విచారణ? - ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

ఫార్ములా ఈ కార్​ రేసింగ్​పై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు: కేటీఆర్​

Last Updated : Dec 20, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.