కొల్లేరులో పెరుగుతున్న వరదనీరు ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు శివారు కేదవరం గ్రామాన్ని వరదనీరు తాకింది. పలుచోట్ల గట్లు నీటమునిగాయి. వరద నీరు తగ్గడానికి సుమారు నెల పైన పడుతుందని స్థానికులు చెబుతున్నారు. పెద్దింట్లమ్మ ఆలయం నుంచి దిగువకు గట్టు పూర్తిగా ఒకవైపు నీటిలో మునిగింది. గ్రామంలోని పశువుల పాకలు, గడ్డి వాములు వరద నీటిలో తేలియాడుతున్నాయి.ప్రస్తుతం పశువులకు మేత కరువయింది. దిగువ నుంచి వరద నీరు పెరుగుతూ వస్తోంది. వరద నీరు తగ్గడానికి సుమారు నెల పైన పడుతుందని స్థానికులు చెబుతున్నారు. పోతునూరు, కేదవరం గ్రామాల మధ్య ఉన్న వరిచేలలో పీకల్లోతు నీరు ఉంది . నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని ఆందోళన రైతులు చెందుతున్నారు.
ఇవీ చదవండి: నీట మునిగిన పంటలు.. అడుగంటిన ఆశలు...