పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురంలోని శివాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరాతన కాలంలో కాశీ నుంచి తెచ్చిన ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి చినకాశీగా పిలుస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు, నోములు, దీపారాధనలు చేశారు.
ఇదీ చూడండి: 36 అడుగుల వాయు శివలింగం.. వెల్లివిరిసిన ఆధ్యాత్మికం..