ETV Bharat / state

విధి నిర్వహణలో విద్యుదాఘాతం.. లైన్​మెన్​ మృతి - latest narasapuram news

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రకాష్ నగర్​లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్​మెన్ విద్యుదాఘాతంతో మృతిచెందారు. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

west godavari district
విధి నిర్వహిస్తూ విద్యుదాఘాతంతో జూనియర్ లైన్ మెన్ మృతి
author img

By

Published : Jun 9, 2020, 8:48 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రకాష్ నగర్​లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి జూనియర్ లైన్ మెన్ మృతి చెందారు. నిడదవోలు మండలం తీపర్రుకు చెందిన దుర్గారావు నరసాపురంలో జూనియర్ లైన్ మెన్​గా పనిచేస్తున్నారు.

సోమవారం రాత్రి విధుల్లో భాగంగా విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్​కు గురై దుర్గారావు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇది చదవండి మన్యంలో ప్రశాంతంగా బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.