పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జనతా కర్ఫ్యూని ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణ ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూ పిలుపుతో గ్రామీణ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితం కావడంతో పట్నంలో జన సంచారమే కరువైంది. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయానికి సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం రోజు వందల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఆదివారం దేవాలయం సైతం మూతపడడంతో వెలవెలపోయింది.
ఇదీచూడండి. 'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి'