ఆచంట నియోజకవర్గంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు లాంఛనంగా ప్రారంభించారు. చెరుకువాడ, సిద్ధాంతం, కొడమంచిలి, ఆచంట, పోడూరు, కవిటం, మార్టేరు ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆచంట ఏఎంసీ చైర్ పర్సన్ ఇందిరా సీతారాం, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
తణుకులో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. విద్యా కానుక కిట్లను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు. పేద పిల్లలు విద్యాధికులు కావాలనే లక్ష్యంతో సీఎం వివిధ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం జగనన్న కంటి వెలుగు పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: