పోలవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ - పోలవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన న్యూస్
ముఖ్యమంత్రి జగన్ పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా వీక్షించారు. ప్రాజెక్టు పనులను గమనించారు. ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు, గుత్తేదారులతో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. నిర్వాసిత గ్రామాల పునరావాస పనులపై జగన్ చర్చించనున్నారు.