ETV Bharat / state

ఉద్యమాన్ని అణిచివేయాలని ఎమ్మెల్యే చూస్తున్నారు: మాజీమంత్రి కొత్తపల్లి - పశ్చిమ గోదావరి జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Kothapally Subbarayudu: నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డప్పులు కొడుతూ నిరసనలో మాజీమంత్రి కొత్తపల్లి పాల్గొన్నారు. ఉద్యమాన్ని అణిచివేయాలని ఎమ్మెల్యే చూస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రం విషయంలో రోజుకో నిర్ణయంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

JAC protests
మాజీమంత్రి కొత్తపల్లి
author img

By

Published : Mar 26, 2022, 10:32 AM IST

Narasapuram News: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చేపట్టిన ఆందోళనలో మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఐకాస ఆధ్వర్యంలో.. డప్పులు కొడుతూ చిందులు వేసి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేడ్కర్ కూడలి నుంచి శివాలయం సెంటర్ వరకు డప్పుల ప్రదర్శన కొనసాగింది. జిల్లా కేంద్రం సాధనకు ఉద్యమాలు చేస్తూ ఉంటే.. ఎమ్మెల్యే అణిచివేత ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగించి తీరుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్.. 9 మంది విద్యార్థులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.