పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని శ్రీ జయలక్ష్మీ ఫెర్టిలైజర్ లిమిటెడ్, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ కంపెనీలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బదులు శానిటైజర్ తాగి మృత్యువాత పడుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎంత పరిమాణంలో తయారు చేస్తున్నారు? ఎంత పరిమాణంలో అమ్మకాలు చేస్తున్నారు? ఏఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే ఆంశాలపై యాజమాన్యాల నుంచి ఆరా తీశారు. శానిటైజర్ సద్వినియోగానికి మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకోవాలని యజమానులకు, కర్మాగారాల అధికారులకు సూచించారు.
శానిటైజర్ తయారీ కర్మాగారాలపై పోలీసుల తనిఖీలు - thanuku latest news
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శానిటైజర్ తయారు చేసే కంపెనీలపై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని శ్రీ జయలక్ష్మీ ఫెర్టిలైజర్ లిమిటెడ్, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ కంపెనీలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బదులు శానిటైజర్ తాగి మృత్యువాత పడుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎంత పరిమాణంలో తయారు చేస్తున్నారు? ఎంత పరిమాణంలో అమ్మకాలు చేస్తున్నారు? ఏఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే ఆంశాలపై యాజమాన్యాల నుంచి ఆరా తీశారు. శానిటైజర్ సద్వినియోగానికి మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకోవాలని యజమానులకు, కర్మాగారాల అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి మరొకరు బలి
TAGGED:
thanuku latest news