ETV Bharat / state

ఏలూరులో ఎన్‌ఐఎన్‌, డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధుల ఇంటింటా వివరాల సేకరణ

author img

By

Published : Dec 9, 2020, 7:51 AM IST

ఏలూరులో అస్వస్థతకు గురైన కుటుంబాలనుంచి ఎన్‌ఐఎన్‌, డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధులు వివరాలు సేకరించారు. తీసుకున్న ఆహారం ఏంటనీ వారిని ప్రశ్నించారు. నివేదికను వైద్యశాఖ అధికారులకు అందజేశారు.

information data collection of NIN and WHO representatives in Eluru
ఏలూరులో అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌), ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రతినిధులు బాధితుల నుంచి నమూనాలు, వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఐసీఎంఆర్‌ (భారత జాతీయ వైద్య పరిశోధన మండలి), ఎన్‌ఐఎన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో కూడిన 9 మంది బృందం నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధితో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అస్వస్థతకు గురై కోలుకున్న వారి నుంచి వివరాలు సేకరించారు. అనారోగ్యం బారిన పడిన రోజు తాగిన నీళ్లు, తీసుకున్న ఆహారం.. ఇలా అన్ని వివరాలూ తెలుసుకున్నారు. కొందరి నుంచి రక్తం, మూత్ర నమూనాలు సేకరించారు. స్పృహ కోల్పోవడానికి ముందు ఏమి తిన్నారు? తిరిగి స్పృహ వచ్చాక ఆరోగ్యస్థితి ఎలా ఉంది? తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఇలా ప్రతి వివరాలు సేకరించారు. ఎన్‌ఐఎన్‌ బృందం సోమవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వాసుపత్రిలోనే ఉండి బాధితుల నుంచి నమూనాలు సేకరించి, వివరాలు తెలుసుకుంది. ఈ బృందంలో డాక్టర్‌ జెజె.బాబుతో పాటు డాక్టర్‌ సిన్హా, డాక్టర్‌ అనంత్‌, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ రాఘవేంద్ర, సాంకేతిక నిపుణులు, వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్యశాఖకు డబ్ల్యుహెచ్‌ఓ సహకారం
బాధితుల నుంచి ఎలాంటి వివరాలు సేకరించాలన్న విషయమై డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధులు భవాని, హర్షిత్‌ ప్రత్యేక నమూనాను రూపొందించి.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అందజేశారు. బాధిత ప్రాంతాలకు వెళ్లి వివరాలు సేకరించారు. రోగులకు తలనొప్పి ఉందా.. లేదా? ప్రయాణాలు చేశారా.. లేదా? ఏయే ప్రాంతాల నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది? ఏ నీటిని బాధితులు తాగుతున్నారు? ఇంటి అవసరాలకు ఏ నీటిని ఉపయోగిస్తున్నారు? ఎలాంటి పాలు వాడుతున్నారు? ఇతర వివరాలు నమూనాలో ఉన్నాయి. సేకరించిన సమాచారాన్ని డబ్ల్యుహెచ్‌ఓకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపుతామని ఓ ప్రతినిధి తెలిపారు.

ఇదీ చూడండి.

ఏలూరు వింత వ్యాధి.. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.