పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు.. 14కు పెరిగాయి. సోమవారం ఒక్కరోజే మండలంలో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సంబంధం ఉన్న వారిని పదుల సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
అత్తిలిలో ఇటీవల పెళ్లి దుస్తుల కొనుగోలు నిమిత్తం విజయవాడ వెళ్లి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది. మూడు, నాలుగు రోజులు గడవక ముందే జగన్నాధపురంలోని ఒక దశదిన కార్యక్రమానికి హాజరై వచ్చిన నలుగురికి పరీక్షలు చేయించగా పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. అత్తిలికి చెందిన వారితో పాటు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన కుటుంబీకులు హాజరు కాగా.. వారిలో మరో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అత్తిలి మండలంలో పాజిటివ్ కేసులు పెరగ్గా.. అధికారులు అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: