గుమ్మాలకు తోరణాలు ఇంకా తొలగలేదు. పెళ్లి ముచ్చట్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అనుకోని ప్రమాదం ఆ నవ దంపతులను మృత్యులోకాలకు తీసుకెళ్లింది. పూళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన వరుడు వెంకటేష్, గుంటూరు జిల్లా గోవాడకు చెందిన వధువు మానస నవ్య, కారు డ్రైవర్ చంద్రశేఖర్ అసువులు బాశారు. ఈనెల 14న వివాహం జరిగింది. వెంకటేష్ తండ్రి చనిపోవడంతో తల్లే కొడుకును చదివించి ప్రయోజకుడిని చేసింది. అతను విశాఖలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నూతన జంట ఈనెల 15న సబ్బవరం వెళ్లారు. 16న సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. 17న గుంటూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ నుంచి 18న తిరిగి సబ్బవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
గోవాడ గ్రామానికి చెందిన ఆలపాటి వెంకటేశ్వరరావు, మణి దంపతుల రెండో సంతానమైన మానస నవ్యను తల్లిదండ్రులు బీటెక్ వరకు చదివించారు. కొంతకాలం ఈమె బెంగళూరులో ఉద్యోగం చేసి ఇటీవలే ఇంటికి వచ్చారు. పెళ్లి జరగడం, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గోవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి
'బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాక మళ్లీ ప్రవేశపెట్టడమేంటి'?