పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి వద్ద అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 160 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న నవీన్ కుమార్... అదే దుకాణంలోని మద్యం సీసాలను అధిక ధరలకు విక్రయించేందుకు రేలంగి తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేపట్టి పట్టుకున్నారు.
ఉండ్రాజవరం మండలానికి చెందిన గణేశ్... పశ్చిమ బెంగాల్‌కు చెందిన మద్యం సీసాలను.. సత్యవాడలో విక్రయిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణేశ్ తండ్రి లారీ క్లీనర్‌గా పనిచేస్తూ లారీపై పశ్చిమ బెంగాల్ వెళ్లినప్పుడు అక్కడి నుంచి సీసాలను అక్రమంగా రవాణా చేసి గణేశ్‌తో అమ్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గణేశ్‌ను అరెస్టు చేశామన్నారు.