ETV Bharat / state

భార్యకు కరోనా పాజిటివ్... ఆవేదనతో భర్త మృతి - పశ్చిమగోదావరిలో వ్యక్తి మృతి

సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం సృష్టించింది. భార్యకు కరోనా సోకటంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

husband died after knowing wife is affected with covid-19 in west godavari
భార్యకు కరోనా పాజిటివ్​ అని తెలటంతో మృతి చెందిన భర్త
author img

By

Published : Jun 11, 2020, 7:13 AM IST

చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని కరోనా కకావికలం చేసింది. భార్యకు కరోనా సోకటంతో తీవ్ర మనోవ్యధకు గురైన భర్త మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన జరిగింది. స్థానిక గన్‌బజార్‌కు చెందిన ఓ వ్యాపారి వన్‌టౌన్‌లో తాళ్ల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన భార్య అనారోగ్యానికి గురికావటంతో కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు పాజిటివ్‌ నిర్ధరణ కావటంతో ఈనెల 8న ఆమెను ఆశ్రం కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. వారుండే ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. కుటుంబ సభ్యులతో సహా మరికొంత మందిని ఈనెల 9న అర్థరాత్రి క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు గన్‌బజారులో ఓ బస్సును సిద్ధం చేశారు. బస్సు ఎక్కేందుకు వెళుతూ తన భార్యకు పాజిటివ్‌ వచ్చిందని ఆవేదన చెందుతూ ఆ భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో 108 సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్‌ రావటంతో బుధవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. నిబంధనల ప్రకారం తక్కువమంది అంత్యక్రియలకు హాజరుకాగా ఖననం చేశారు. కరోనా పరీక్షల్లో బుధవారం అతని కుమారుడికి పాజిటివ్‌ రావటంతో అంత్యక్రియల అనంతరం ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ఐదు రోజుల్లోనే 110 మందికి కరోనా పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.