పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 'చలో' పోలవరం పిలుపునిచ్చారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. పోలవరం యాత్రను అడ్డుకోవటానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భీమారావును గృహ నిర్బంధం చేశారు. వారి తీరును పార్టీ నేతలు తప్పుబట్టారు. ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: