పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మన్యం మండలాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. పోలవరం మండలం కొత్తూరు, తుటిగుంట తదితర గ్రామాల్లోకి నీరు చేరుకుంది. ఆయా గ్రామాల ప్రజలు కొండప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పలు గిరిజన గ్రామాల్లో నీట మునిగాయి. వేలేరుపాడు మండలం ఎడవల్లి - బోళ్లపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కుక్కునూరు మండలం లచ్చిగూడెం, వెంకటాపురం గ్రామాలకు వరద నీరు చుట్టు ముట్టింది.
ఇవీ చదవండి: మేం ఎక్కడికి వెళ్లాలి..?: ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన