పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చేపల మార్కెట్కు అమ్మకానికి భారీగా చేపలు వచ్చాయి. ఒక్కొక్క చేప 20 నుంచి 25 కిలోలు ఉన్నాయి. సమీపంలో ఉన్న ఎర్రకాల్వ జలాశయం నుంచి చేపలు మార్కెట్కు తీసుకువచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. జలాశయంలో నీరు తగ్గడంతో భారీ చేపలు పడుతున్నట్లు చెప్పారు. ఒక్కొక్క చేప రూ.4 వేల నుంచి 4500 వరకు అమ్ముడుపోయాయి. కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. మార్కెట్లోకి భారీ చేపలు వచ్చాయని తెలియడంతో ప్రజలు ఎగబడి కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి 'లక్షల మంది వలస కార్మికులకు కరోనా ముప్పు'