కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ అమలు కారణంగా.. ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు తణుకులో వైకాపా నాయకులు సరకులు పంపిణీ చేశారు. శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పంపిణీని ప్రారంభించారు.
పట్టణంలోని సుమారు 600 మంది ఆటో డ్రైవర్లకు సరకులతో పాటు.. కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఆటోడ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి తమ వంతు సాయం అందించామని దాతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: