పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సురక్షిత తాగునీరు సరఫరా నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 56 కోట్ల 14 లక్షల 70 వేల రూపాయలు మంజూరు చేశాయి. మంజూరైన నిధులతో మూడు మండలాలలోని గ్రామాలలో సురక్షిత తాగునీరు అందించడానికి వీలవుతుందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా 42,928 ఉచిత కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఇదీ చదవండి: సెల్ఫోన్ పోయిందని... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!