ఆమెకు ఆ ఊరితో ఎలాంటి సంబంధం లేదు.. కానీ 20 రోజులుగా ఊరికి సమీపంలోనే ఉంటోంది. ఎవరు పలకరించినా పలకదు. ఎవరైనా తినడానికి ఏమైనా ఇస్తే మాత్రం తీసుకుంటోంది. ఎండా, వానా, పగలు, రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు సమీపంలోని రేపల్లె కాలువ వద్ద ఓ మహిళ పరిస్థితి ఇది. కాలువ వంతెనకు మూలగా... బరకం వేసుకుని ఉంటోంది. ఊర్లోవాళ్లు పిలిచినా వెళ్లడం లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్లి వివరాలు అడిగినా స్పందించడం లేదు.
ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఈటీవి భారత్ ప్రతినిధితో మాత్రం తన పేరు కవాసి లక్ష్మి అని.... పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామం అని చెప్పింది. ఇక్కడకు ఎందుకు వచ్చారని అడిగితే... మందో, మాకో పెడితే మీరు రారా అని ప్రశ్నించింది. ఎప్పుడూ ఇళ్లు దాటని తనని... చెట్లు పుట్టలు పట్టించారని చెప్పింది. తిరిగి పోలవరం వెళ్లేది లేదని... తన పుట్టినిళ్లు అయిన దేవీపట్నం మండలం మూలపాడు వెళ్తానని చెప్పింది. ఆమె జనావాసాలకు దూరంగా ఉండటంతో గ్రామ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆమెకు ఏదైనా అయితే తమపైకి నిందలు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్