గోదావరి ఉద్ధృతితో పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు గ్రామాలు వణికిపోతున్నాయి. జిల్లాలోని గోదావరి పరీవాహక గ్రామాల్లో భారీ స్థాయిలో వరద నీరు చుట్టుముట్టింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పోలవరం మండలంలో 19 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.
వేలేరుపాడు, రుద్రంకోట, రేపాకగొమ్ము, నార్ల వరం, తిరుమలాపురం గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. కుక్కునూరు మండలం కొమ్ముగూడెం, సీతారాంపురం, లచ్చి గూడెం, తిరుమల గూడెం గ్రామాల్లోకి నీరు వస్తోంది. సుమారు 12 గ్రామాల ప్రజలు గ్రామాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పలు ఊర్లకు రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: