పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన కాపర్ డ్యామ్‌పై నుంచి వరద పొంగి పొర్లుతోంది. 3రోజులు క్రితం (పోలవరం ప్రాజెక్ట్ అథార్టీ) పీపీఏ కమిటీ పనులను పరిశీలించింది. వరదలు వస్తే ఎగువ ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా... ఎగువ కాపర్ డ్యామ్ ఎడమ వైపు 3మీటర్లు ఎత్తు పెంచాలని పీపీఏ కమిటీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. కానీ అనుకోని విధంగా వరద రావడంతో నది మధ్య భాగంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం మరో 2రోజులు కొనసాగవచ్చని కేంద్ర జలసంఘం కమిటీ అచనా వేస్తోంది.
ఇదీ చదవండీ...