పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. వరద మరింత పెరగటంతో... కొత్తూరు కాజ్వే పైకి వరద నీరు చేరుకుంది. 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి...వాళ్లకు నిత్యావసర వస్తువులూ దొరకని పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యగా రేషన్ బియ్యాన్ని లాంచీల ద్వారా సరఫరా చేయాలని... అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారానికి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చని కేంద్ర జల సంఘం అధికారులు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: వర్షాలతో నీట మునిగిన పంటలు