మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ వారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, బెదిరించినా.. తమ పార్టీ అభ్యర్థులు క్రమశిక్షణకు లోబడి ఎదురొడ్డి నిలిచారని అభినందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నిజాయితీ గల తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండీ.. రెండేళ్ల హిందూపురం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బాలకృష్ణ