పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మాంసం దుకాణల్లో ఆహార భద్రతావిభాగం, నగరపాలక సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకటో పట్టణ పరిధిలోని పలు మాంసం దుకాణాల్లో చేపట్టిన దాడుల్లో... అధికంగా మాంసం కొవ్వును నిల్వఉంచడం గుర్తించారు. ఈ కొవ్వును హోటళ్లలో బిరియాని తయారిలో వినియోగిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో మేక, గొర్రెల తోకలు కూడా భారీగా నిల్వఉంచడం కనుగొన్నారు. వీటిని మాంసానికి అతికించి...ఆరోగ్యకరమైన తాజా మాంసం విక్రయిస్తున్నట్లు వినియోగదారులను నమ్మించే మోసం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. ఆహార భద్రతావిభాగం నియమాలను కూడా దుకాణదారులు పాటించడంలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అరకు ఆదివాసీల పాటను ఆస్వాదించిన పవన్