తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మంచు అందాలు కనువిందు చేశాయి. ఉదయం 9 గంటల సమయం దాటినా.. విరీతమైన మంచు కురుస్తూనే ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఉదయం నుంచి కురుస్తున్న మంచు అందాలు చూడముచ్చటగా ఉన్నాయి. పక్షుల కిలకిల రాగాల నడుమ కొబ్బరి చెట్లు, ఇళ్లు, పంట పొలాలపై కురుస్తున్న మంచు తెరలను చూస్తూ ప్రజలు ఆనందించారు.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై అక్రమార్కుల రాజ్యం... ఏటా రూ.కోట్లలో ఆదాయానికి గండి