గోదావరికి వరద కొనసాగుతోంది. రెండు రోజుల కిందట తగ్గిన వరద.. నిన్నటి నుంచి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరులో సుమారు 45 గ్రామాలు నీటిలోనే ఉన్నాయి.
వశిష్ట గోదావరిలో ఆచంట, యలమంచలి మండలాల్లోని 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.... లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సమయంలో మాత్రమే అధికారులు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా మారిందని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకొంటున్నారు.
ఇదీ చదవండి