పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద కొనసాగుతోంది. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 55ముంపు గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపు మూడు అడుగుల మేర వరద నీరు నిలిచింది. ఇళ్లలోకి సైతం వరద నీరు వెళ్లింది. విలువైన వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి.
వేలేరుపాడు మండల కేంద్రంలో వరద నీరు చేరింది. నార్లవరం, తాటకూరుగొమ్మ, తిరుమలపురం, రుద్రంకోట గ్రామాలతో పాటు... 30గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో ఐదు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా.. కుక్కునూరు, సీతారామపురం గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరింది. పోలవరం మండలంలో 19 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా.. రెండు గ్రామాల్లో వరద నీరు చేరింది. వశిష్ట గోదావరికి వరద పెరగడంతో యలమంచలి మండలం కనకాయలంక, యలమంచలిలంక, దొడ్డిపట్ల లంకగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆచంట మండలంలోని ఆయోధ్యలంకతో పాటు.. మూడు గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది.
ఇదీ చదవండి