పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లిలోని ఇసుక ర్యాంపు వద్ద ఐదుగురు కార్మికులు మంచినీళ్లు అనుకుని ప్రమాదవశాత్తు గుళికల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న కార్మికులను గమనించిన స్థానికులు వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో మద్దాల వీర్రాజు, మద్దాల శ్రీనివాసరావు, పెనుమూరు వెంకటేశ్వరావు, పెనమలూరు కొండయ్యగా గుర్తించారు. వీరంతా కూలి పనులు చేసుకుని జీవించేవారని బాధితుల బంధువులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. క్షతగాత్రుల్లో మద్దాల శ్రీనివాసరావు పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంచినీళ్లు అనుకుని గుళికల మందు తాగారు..ఒకరి పరిస్థితి విషమం - పశ్చిమగోదావరి జిల్లాలో గుళికలమందు తాగిన ఐదుగురు కార్మికులు
మంచినీళ్లు అనుకుని ప్రమాదవశాత్తు గుళికలమందు తాగిన ఐదుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలోని ఇసుక ర్యాంపు వద్ద జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఐదుగురు కార్మికులను గ్రామస్థులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
![మంచినీళ్లు అనుకుని గుళికల మందు తాగారు..ఒకరి పరిస్థితి విషమం తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురు కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6068083-489-6068083-1581664510251.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లిలోని ఇసుక ర్యాంపు వద్ద ఐదుగురు కార్మికులు మంచినీళ్లు అనుకుని ప్రమాదవశాత్తు గుళికల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న కార్మికులను గమనించిన స్థానికులు వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో మద్దాల వీర్రాజు, మద్దాల శ్రీనివాసరావు, పెనుమూరు వెంకటేశ్వరావు, పెనమలూరు కొండయ్యగా గుర్తించారు. వీరంతా కూలి పనులు చేసుకుని జీవించేవారని బాధితుల బంధువులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. క్షతగాత్రుల్లో మద్దాల శ్రీనివాసరావు పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గిరిజన చిన్నారి మృతి... నులిపురుగుల మందే కారణమంటున్న తల్లి