పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వైకాపా అనుచరులు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువ గట్టుపై మట్టిని అక్రమంగా తవ్వి.. తరలిస్తున్నారన్న ఆరోపణలతో పలువురు తెదేపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తెదేపాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైకాపాకు చెందిన వారికి స్వల్ప గాయాలు కాగా.. వారిని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే తమపై వైకాపా అనుచరులు దాడి చేశారని.. తెదేపా వర్గం వారు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గ్రామ సర్పంచి పసుపులేటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: