పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోలు నగదు చెల్లించడానికి తక్షణం చర్యలు చేపట్టాలంటూ.. దెందులూరు మండలం పోతునూరు సహకార సంఘం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు . రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధాన్యం అమ్మకాలు జరిగి 25 రోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమ కాలేదని రైతులు ఆవేదన చెందారు . పంట అమ్మకానికి సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నా.. ఇప్పటివరకు అధికారులు వాటిని పరిష్కరించలేన్నారు. ఈ కర్షక్ లో పేర్లు ఉన్నా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పేర్లు కనిపించటం లేదని చెప్పారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి: