తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని సైతం తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఆంక్షలను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ జీవీ. శేషగిరికి ఈ విషయమై వినతి పత్రం ఇచ్చారు.
స్పందించిన తహసీల్దార్ శేషగిరి.. రైస్ మిల్లులకు ధాన్యాన్ని ఎవరు తీసుకెళ్లన్నారంటూ రైతులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం వద్ద చూపించి తగిన గిట్టుబాటు ధర పొందాలని నిరసన చేస్తున్న రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోతే వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: