పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం మార్కెట్ యార్డ్ గోదాం వద్ద రైతులు నిరసన చేపట్టారు. అకాల వర్షానికి తడిచిన మొక్కజొన్న, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పురుగులమందు డబ్బాలు పట్టుకుని నినాదాలు చేశారు. సరైన సమయంలో పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో.. వర్షాల కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గోనెసంచులు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవి కార్యరూపం దాల్చడం లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, గోనెసంచులు ఇచ్చి ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి.