ETV Bharat / state

కానరాని సంక్రాంతి వెలుగులు.. ధాన్యం నగదు అందక రైతుల వెతలు - పశ్చిమగోదావరి జిల్లా నేటి వార్తలు

తుపాన్లు, తెగుళ్లకు ఎదురొడ్డి ఈ సారి ఖరీఫ్‌లో వరి రైతులు పంట పండించారు. అనేక కష్టాలు, నష్టాలను చవిచూశారు. కాస్తోకూస్తో పండిన పంటను విక్రయించినా.. ధాన్యం సొమ్ములు సకాలంలో అందని పరిస్థితి. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. సంక్రాంతి సమీపించినా.. ధాన్యం బకాయిలు రాక రైతులు దిగులు చెందుతున్నారు.

farmers-problems-with-not-giving-money-for-crop-purchase-in-west-godavari-district
ధాన్యం నగదు సకాలంలో అందక రైతుల వెతలు
author img

By

Published : Jan 10, 2021, 7:39 AM IST

ధాన్యం నగదు సకాలంలో అందక రైతుల వెతలు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయిస్తే.. వారం రోజుల్లో సొమ్ము రైతు ఖాతాల్లో జమకావాలి. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు ధాన్యాన్ని విక్రయించి.. రెండు నెలలు గడుస్తున్నా.. నగదు జమ కాలేదు. జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 375ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా... 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రైతులకు 13 వందల50కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. 600 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు. 750కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. తమకు రావాల్సిన పైకం కోసం కాళ్లరిగేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.

ఖరీప్ పంట సాగులో వచ్చిన ఆదాయాన్ని... రైతులు రబీ పంట సాగుకు పెట్టుబడిగా వినియోగిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా వరిసాగు చేపట్టారు. చేతిలో సొమ్ములులేక పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేస్తున్నారు. ధాన్యం బకాయిలు సకాలంలో రాకపోవడం వల్ల.. అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో నెల రోజులు దాటినా నగదు రాకపోవడంతో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. రైతుల నగదు చెల్లింపులకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ దాసి రాజు తెలిపారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమచేస్తామన్నారు.

ధాన్యం డబ్బులు చెల్లించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో కౌలు రైతులు నిరసన చేపట్టారు. తమను ఆదుకోవాలంటూ ఉన్నత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

4 దశల్లో పంచాయతీ ఎన్నికలు..షెడ్యూల్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.