ETV Bharat / state

'నకిలీ విత్తనాలతో నష్టపోయాం.. న్యాయం చేయండి'

author img

By

Published : Apr 20, 2021, 10:38 AM IST

పంటసాగు మొదలైనప్పటి నుంచి.. దిగుబడి చేతికి వచ్చి అమ్ముకునేదాకా రైతులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటారు. అతివృష్టి, అనావృష్టి, పంట తెగుళ్లు, దళారుల చేతిలో మోసాలతో ఇబ్బందులు పడుతుంటారు. అలానే.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో కల్తీ విత్తనాలు సాగు చేసి నష్టపోయామని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

farmers demand for justice for their lost with fake seeds
నష్టపోయిన రైతుల నిరసన
నకిలీ విత్తనాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు

నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన రైతులు మండల వ్యవసాయ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఏడీఏ బుజ్జిబాబును కలిసి సమస్యను వివరించారు. ఈ గ్రామానికి చెందిన 30 మంది రైతులు 200 ఎకరాల్లో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విత్తన వరి వంగడాన్ని నాటారు. ప్రస్తుతం కోతదశకు వచ్చిన పంటలో కల్తీ గింజలు(కేళీలు) రావడంతో కంపెనీ ప్రతినిధులు వాటిని కోయించారు.

తరువాత సైతం కల్తీ గింజలే వచ్చాయని.. ఈ కారణంగా దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని విత్తన సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని.. తమకు న్యాయం చేయాలని ఏడీఏను కోరారు. ఈ మేరకు... రాఘవాపురంలో ఆ సంస్థ ప్రతినిధులతో ఏడీఏ సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై ముగిసిన వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.