పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని రైతులు అడ్డుకుని నిలుపుదల చేశారు. లోగ్రేడ్ పొగాకు ధర రోజురోజుకి పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ మేలురకం గ్రేడులు మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రారంభంలో అన్ని గ్రేడులు సమానంగా కొనుగోలు చేస్తామని ...ఇప్పుడు మాత్రం లోగ్రేడ్ను విస్మరించడం అన్యాయమన్నారు. ఇప్పటికే సాగులో వరుస నష్టాలు చవి చూసిన తమకు ఈ ఏడాది గట్టి దెబ్బ తగిలిందన్నారు. కొనుగోలుకు మార్క్ ఫెడ్ రాగానే సంతోషం వ్యక్తం చేసిన పొగాకు రైతులు ప్రస్తుతం ధరలపై మండిపడుతున్నారు. పొగాకుకు మద్దతు ధర ఇవ్వకపోతే జిల్లావ్యాప్తంగా 5 వేలం కేంద్రాల్లో అమ్మకాలు నిలుపుదల చేస్తామని రైతులు తెలిపారు.
ఇదీ చూడండి. విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి రూ.4 వేల 65 కోట్లు