దొండకు ఎలాంటి గిట్టుబాటు ధర లేదని.. తీవ్రంగా నష్టపోతున్నామని ఏలూరు కలెక్టరేట్ ఎదుట రైతులు వాపోయారు. కొవిడ్-19 వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో దొండ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆదుకోవాలని నినాదాలు చేశారు. పందిరి సేద్యానికి చీడపీడలు ఆశిస్తున్నా.. అధికారులు ఎలాంటి సూచనలు, సలహాలు అందించడం లేదని రైతులు తెలిపారు. పందిరి సేద్యానికి ఖర్చు చేసిన రాయితీలు అందించి.. దొండ రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు!