ఆటో ఫైనాన్స్ దుకాణం నడుపుతున్న నాగభూషణం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నకిలీ వాహన బీమా ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నాడు. వీరిని గుర్తించిన పోలీసులు నాగభూషణం, ఆయనకు సహకరించిన వెంకటరత్నాన్ని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కంప్యూటర్లు, నకిలీ బీమా ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా డబ్బు చెల్లించి వాహనాలకు బీమా తీసుకొంటారు. ఎలాంటి డబ్బు చెల్లించకుండా... అధికారులను మోసగించాలన్న ఉద్దేశంతో ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాల తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నట్లు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి :