అనిశా అధికారి అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న జయకృష్ణ అనే నకిలీ అనిశా అధికారిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులో ఒక అధికారిని బెదిరించి రూ. ఐదు లక్షలు డిమాండ్ చేశాడని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చిన అధికారి.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు నిందితుడిని వలపన్ని పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన జయకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా అనిశా అధికారిని అంటూ వివిధ శాఖల అధికారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతపురం, విశాఖ, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిందితుడిపై 17 కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని జయకృష్ణ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని అన్నారు.
ఇదీ చదవండి