పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించినా.. ఆక్కడ కూడా ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు వెల్లడించినా.. ఆహారం తీసుకోకుండా ఆయన దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన మాధవ నాయుడు.. జిల్లా కేంద్రం విషయంలో నరసాపురానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు, వైకాపా కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి తన అనుచరులను తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఆరోపించారు.
ఇదీ చదవండి: వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల