పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో పర్యటించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరదల్లో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు.
కొత్త ఇళ్లు నిర్మించుకునేందుకు ఐటీడీఏ నుంచి ఆర్ధిక సహాయం చేయాలని గిరిజనులు కోరారు. ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.2 వేలు అందించారని ఎంపీ, ఎమ్మెల్యే గిరిజనలకు తెలిపారు. అనంతరం పడవ మీద వెళ్లి పోలవరంలో నెక్లెస్ బండ్‌ను పరిశీలించారు.
ఇవీ చదవండి: వరద నీటిలోనే గ్రామాలు... నిత్యావసరాల కోసం ప్రజలు పాట్లు